AP SSC Results Date: ఏపీ 10th పరీక్షలు అయిపోయాయ్.. ఇక రిజల్ట్స్ ఎప్పుడు?
పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇక రిఫ్రెష్ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బోర్డు పరీక్షలు మంగళవారం ముగిశాయి. ఈ పరీక్షలు మార్చి 15న ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి పరీక్ష (సోషల్ స్టడీస్) మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగింది.
పరీక్షలు సోమవారమే ముగియాల్సి ఉండగా, రంజాన్ పండుగ కారణంగా ఈ పరీక్ష మంగళవారం జరిగింది. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇక రిఫ్రెష్ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) పరీక్షలను సజావుగా నిర్వహించింది.
Also Read: విశాఖను ఆర్థిక రాజధానిగా మలిచేందుకు ప్రణాళికలు.. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది?
రాష్ట్ర వ్యాప్తంగా 2,800కు పైగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. వేలాది మంది ఇన్విజిలేటర్లు, సూపర్‌వైజర్లు, ఇతర అధికారులను పనిచేశారు. బోర్డు పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను వాడింది.
ఇక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పరీక్షల ఫలితాలు మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాల ప్రకటన తేదీని బోర్డు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
ఫలితాలకు సంబంధించిన వివరాలను https://www.bse.ap.gov.in/లో చూడొచ్చు. పరీక్షా ఫలితాలను ప్రకటించిన తర్వాత విద్యార్థులు ఉన్నత మాధ్యమిక విద్య లేదా ఇతర కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.