అమరావతితో పాటు విశాఖ అభివృద్ధికి అద్భుత ప్రణాళికలు.. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది?

మంత్రి లోకేశ్‌ మొత్తం విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెడితే.. సీఎం చంద్రబాబు అమరావతి గురించి ఎక్కువగా చెబుతుంటారు.

అమరావతితో పాటు విశాఖ అభివృద్ధికి అద్భుత ప్రణాళికలు.. ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది?

Updated On : April 1, 2025 / 9:32 PM IST

కూటమి సర్కార్ అమరావతితో పాటు విశాఖ అభివృద్ధిపై కూడా ఫోకస్ పెట్టిందా.. విశాఖను ఆర్థిక రాజధానిగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందా.. అమరావతి, విశాఖను కూటమి సర్కార్‌ రెండు కళ్లుగా భావిస్తుందా. ఈ రెండు నగరాల అభివృద్ధిని బ్యాలెన్సింగ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా.. అమరావతి, వైజాగ్‌ డెవలెప్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ఏం చేయబోతోంది. లెట్స్ వాచ్..

ఏపీకి అద్భుతమైన రాజధానిని నిర్మించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల మంత్రం జపించినా కూటమికే జై కట్టారు ప్రజలు. వైసీపీ గెలిస్తే.. విశాఖ రాజధాని అవుతుందని తెలిసినా.. ఆ ప్రాంత ప్రజలు కూటమికే పట్టం కట్టారు. ఐతే విశాఖ ప్రజలు ఎక్కడ నిరుత్సాహ పడిపోకుండా కూటమి సర్కార్ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తుందట.

కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చిన డే వన్ నుంచి అమరావతి నిర్మాణపనుల విషయంలో యాక్షన్ ప్లాన్‌ని రెడీ చేసుకొని ముందుకు వెళ్తోంది. అదే సమయంలో రాయలసీమ ఉత్తరాంధ్రాకు కూడా సమన్యాయం చేసేలా ప్రణాళికలను రూపొందించిందట కూటమి సర్కార్. అమరావతితో పాటు విశాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. విశాఖను ఐటీ హబ్‌గానూ పారిశ్రామిక కేంద్రంగానూ తీర్చిదిద్దడానికి ఉన్న అన్ని అవకాశాల్ని వాడుకుంటోంది. అలా విశాఖపట్నం వాసుల కలలను నెరవేర్చే పనిలో సక్సెస్ అవుతోందని లోకల్ టాక్.

ఇలా రెండు నగరాలను డెవలప్‌ చేసేలా..
తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌.. ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్‌గా మార్చుతామని ప్రకటించారు. విశాఖలో రానున్న ఐదేళ్లలో ఏకంగా 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ నగరంగా, ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ ఏపీకే గొప్ప నగరంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

విశాఖ గురించి గొప్పగా చెప్పడమే కాకుండా విశాఖకు కూటమి ప్రభుత్వం ఏమి చేసింది ఏమి చేయబోతోంది క్లారిటీ ఇచ్చేశారు లోకేశ్‌. ఇలా విశాఖ రాజసం కానీ రాజధాని హోదా కానీ ఎక్కడా తగ్గకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లేలా కనిపిస్తోందని లోకల్‌ పీపుల్స్ చర్చించుకుంటున్నారట.

మంత్రి లోకేశ్‌ మొత్తం విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెడితే.. సీఎం చంద్రబాబు అమరావతి గురించి ఎక్కువగా చెబుతుంటారు. ఏ సభకు వెళ్లినా. ఏ కార్యక్రమానికి వెళ్లినా… అమరావతి అద్భుతంగా తీర్చుదిద్దుతామని చంద్రబాబు ప్రస్తావిస్తారు.

ఇలా రెండు నగరాలను డెవలప్‌చేసేలా కూటమి సర్కార్ దూసుకెళ్తోందని అన్నివర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ విషయంలో విశాఖ జనాలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారట. ఏది ఏమైనా అమరావతి, విశాఖ రెండింటినీ కరెక్ట్‌గా బాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారని బలమైన టాక్ జనాల్లోకి వెళ్లిపోయిందట.