ప్రియుడిని కిడ్నాప్ కు వివాహిత హైడ్రామా..ఘర్షణలో యువకుడి తండ్రి మృతి

  • Published By: nagamani ,Published On : November 11, 2020 / 12:09 PM IST
ప్రియుడిని కిడ్నాప్ కు వివాహిత హైడ్రామా..ఘర్షణలో యువకుడి తండ్రి మృతి

Updated On : November 11, 2020 / 12:37 PM IST

AP visakhapatnam woman try to kidnap his lover : సమాజంలో బంధాలు..అనుబందాలు పెడదారి పడుతున్న పరిస్థితులు ఆందోళనకలిగిస్తున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో జరిగే దారుణాలు పెరుగుతున్నాయి. ఈ సంబంధాలు హత్యలు..కిడ్నాపులకు పురిగొలుపుతున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టే ఈ వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్రమంలో వారి పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి.



అటువంటి ఓ సంబంధం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. వివాహం అయి వేరే యువకుడితో సంబంధం పెట్టుకుని జల్సాగా తిరిగి వచ్చి..ఇరు కుటుంబాలకు తలవంపులు తెచ్చిపెట్టటమేకాక సదరు యువకుడి కిడ్నాప్ చేస్తున్న క్రమంలో సదరు యువకుడి తండ్రి మరణానికి కారణమైన ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి తగరపువలసలోని బాలాజీనగర్‌లో నివసించేది. ఆమెకు అదే కాలనీకి చెందిన రౌతు వంశీకృష్ణ అనే 24 ఏళ్ల యువకుడితో పరిచయమయ్యింది. ఆ పరిచయం ముదిరి వివాహేతన సంబంధానికి దారి తీసింది. అలా ఒకరి మైకంలో మరొకరు పడి ఇద్దరూ కలిసి ఇంటినుంచి వెళ్లిపోయారు. కొంతకాలం జల్సాగా తిరిగారు. కానీ ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయిన విషయం తెలియని ఆమె కుటుంబ సభ్యులు భీమిలిలో మిస్సింగ్ కేసు పెట్టారు.



https://10tv.in/in-the-city-of-visakhapatnam-a-couples-300-yards-of-land-was-prepared-to-be-encroached-by-intruders/
కొంతకాలానికి ఇద్దరూ కలిసి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు కొన్ని గొడవలు జరిగాయి. అనంతరం వంశీకృష్ణ తండ్రి రౌతు వెంకట్రావు (48) ఆమెకు రూ. 2 లక్షలు ఇచ్చి ఇకపై నా కొడుకుకు దూరంగా ఉండాలని..నాకొడుకుని వదిలేయాలని ఏకంగా పేపర్ మీద రాయించుకుని ఆమెతో సంతకం కూడా పెట్టించుకున్నాడు. ఆ తరువాత ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో వెంకట్రావ్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.


ఈక్రమంలో మంగళవారం (నవంబర్ 10,2020) మధ్యాహ్నం వంశీకృష్ణ తన తండ్రి నిర్వహిస్తున్న చికెన్ షాపుకు వెళ్తుండగా..అండర్ పాస్ వంతెన కింద నలుగురు యువకులతో కలిసి కాపు కాసిన సదరు మాజీ ప్రియురాలు వంశీకృష్ణ రాగానే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది.


అది గమనించిన వంశీకృష్ణ తండ్రి పరుగుపరుగున వచ్చి కొడుకుని వారి నుంచి కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో కిడ్నాపర్లకు..వెంకట్రావుకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వంశీకృష్ణను ఎలాగైనా ఎత్తుకుపోవాలని కిడ్నాపర్లు..ప్రియురాలు నానాన యత్నాలు చేస్తుండగా..వారి నుంచి కొడుకును కాపాడకునేందుకు వెంకట్రావు కూడా తీవ్రంగా యత్నించారు.


నీకు డబ్బులిచ్చాను..నాకొడుకుని వదిలేయమని అడిగాను..దానికి నువ్వు ఒప్పుకుని సంతకం కూడా పెట్టి మళ్లీ నా కొడుకుని కిడ్నాప్ చేయటానికి మనుషులతో వచ్చావు నువ్వసలు మనిషివేనా? ఆడదానివేనా? అంటూ నిలదీశాడు. మళ్లీ వచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేయటానికి వచ్చావా? అంటూ ఆవేదనతో ఆగ్రహం వ్యక్తంచేశాడు.


ఆమెను ప్రశ్నిస్తూనే కొడుకుని కిడ్నాపర్ల నుంచి తప్పించేందుకు వారితో పెనుగులాడాడు. ఈ క్రమంలో కిందపడిన వెంకట్రావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయపడిన కిడ్నాపర్లు..సదరు మహిళ వారిని అక్కడే వదిలేసి కారులో పరారయ్యారు. వంశీకృష్ణ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.



– – –
వంశీతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కొద్దిరోజులు బయటకు వెళ్లిపోయారు. భీమిలి స్టేషన్‌లో దీనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. పెద్దల సమక్షంలో వంశీ తండ్రి ఆమెకు రూ.2లక్షలు ఇచ్చి పత్రాలు రాయించుకున్నారు.