ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం..! ఏం జరగనుంది?

వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.

ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం..! ఏం జరగనుంది?

Ap Vs Telangana : ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం మొదలైందా? హైదరాబాద్ లో ఆస్తుల హక్కులపై తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయా? నిన్నటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని కొన్ని భవనాలు తమకే చెందుతాయని ఏపీ సర్కార్ పట్టుబడుతోంది. హైదరాబాద్ లో 12 భవనాల్లో వాటా కోసం ఏపీ సర్కార్ పట్టుబడుతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ లో షెడ్యూల్ 9, 10 పరిధిలో ప్రస్తావించని 12 సంస్థలు, భవనాల్లో తమకు వాటా ఉందనేది ఏపీ వాదన. మరోవైపు హైదరాబాద్ లో ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ సర్కార్ తేల్చి చెబుతున్నట్లు సమాచారం. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. దీంతో ఏపీ హక్కులు కోల్పోయిందని తెలంగాణ అంటోంది. హైదరాబాద్ లో ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ పరిధిలో 32 సంస్థలు, ఇతర ఆస్తుల్లో ఏపీ వాటా కోరుతుండగా.. అందులో చాలా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆ జాబితాను 12కి కుదించినట్లుగా తెలుస్తోంది. ఈ 12 సంస్థల్లో గండిపేట దగ్గరున్న ఆక్టోపస్ బిల్డింగ్, అక్కడి స్థలం, ఖైరతాబాద్ లోని హెచ్ఏసీ భవన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ లెజిస్ లేట్ ఆఫీస్ బిల్డింగ్.. ఇలా 12 సంస్థలు వాటి తాలూకు ఆస్తులు ఏపీ తన జాబితాలో పెట్టుకుంది. ఈ ఆస్తులపై ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా అధికారులతో సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

Also Read : అజ్ఞాతంలో.. మీసం మెలేసి, తొడలు చరిచిన ఆ జిల్లా వైసీపీ నాయకులు..!