రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై నెట్టేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది: వైఎస్ షర్మిల

అన్నింటికీ గత వైసీపీ పేరు చెప్పి కాలం గడుపుతున్నారని, వైసీపీకి చంద్రబాబు పాలనకు తేడా ఏంటని నిలదీశారు.

రూ.6 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై నెట్టేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది: వైఎస్ షర్మిల

YS Sharmila

Updated On : October 26, 2024 / 3:47 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై నెట్టేయడానికి సిద్ధమైందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ చార్జీలు పెంచితే తప్పుబట్టిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడెందుకు ప్రజలపై భారం వేస్తున్నారని ఆమె నిలదీశారు.

కూటమి అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. డిస్కంలపై భారం పడితే ప్రభుత్వం చెల్లించాలని, ప్రజలపై భారం మోపవద్దని అన్నారు. అన్నింటికీ గత వైసీపీ పేరు చెప్పి కాలం గడుపుతున్నారని, వైసీపీకి చంద్రబాబు పాలనకు తేడా ఏంటని నిలదీశారు. విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గట్లేదని, ఇప్పుడు చంద్రబాబే సీఎం కదా అని అన్నారు.

ఏం అడిగినా గత ప్రభుత్వ పేరు చెబుతున్నారని షర్మిల తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చెయ్యడం లేదని ప్రశ్నించారు. చిన్న చిన్న హామీలే అమలు చేయలేకపోతే పెద్దవి ఎలా అమలు చేస్తారని అన్నారు. వైసీపీకి వచ్చిన చెడ్డ పేరే ఇప్పటి ప్రభుత్వానికి రాబోతుందని, ఉచిత ఇసుకలో ఉచితం లేదని, ఇతర చార్జీల పేరుతో మరింత రేట్లు పెరిగాయని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం : సీఎం చంద్రబాబు నాయుడు