Solar Power : సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది.

Solar Power : సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

Solar Power (2)

Updated On : November 13, 2021 / 3:50 PM IST

Solar Energy Corporation : సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీఈఆర్సీ పచ్చజెండా ఊపింది. ఏడు వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఏపీ డిస్కంలకు అనుమతి ఇచ్చింది. 2026 సెప్టెంబర్‌ నాటికి 10వేల మెగా వాట్లు సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ సమ్మతించింది.

సౌర విద్యుత్‌ కొనుగోళ్లపై త్రైపాక్షిక ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వీలింగ్‌, నెట్‌ వర్క్‌ ఛార్జీలు ప్రభుత్వం నుంచి తీసుకోవాలని ఈఆర్సీ సూచించింది. 2024 నుంచి 25ఏళ్ల పాటు కొనుగోలుకు అనుమతి ఇచ్చింది.

Terrorist Attack : మణిపూర్‌లో జవాన్లపై ఉగ్రవాదుల మెరుపు దాడి..కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి

2024 సెప్టెంబర్‌ నాటికి 3వేల మెగావాట్లు, 2025 నాటికి మరో 3వేల మెగావాట్లు, 2026 నాటికి 1000మెగావాట్ల కొనుగోలుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది.