IT courses training : ఐటి కోర్సుల్లో శిక్షణకు త్వరలో ఏపీఐటీఏ నోటిఫికేషన్

రాష్ట్రంలోని విద్యార్థులకు అధునాతన సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అకాడమీ వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనుంది.

IT courses training : ఐటి కోర్సుల్లో శిక్షణకు త్వరలో ఏపీఐటీఏ నోటిఫికేషన్

Notification Soon For Training In It Courses

Updated On : March 31, 2021 / 12:04 PM IST

notification soon for training in IT courses : రాష్ట్రంలోని విద్యార్థులకు అధునాతన సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అకాడమీ(ఏపీఐటీఏ) వివిధ ఐటీ కోర్సుల్లో శిక్షణకు త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఏప్రిల్‌లో ఈ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు సంస్థ సీఈవో సుందర్‌ తెలిపారు. పరిశ్రమలు-విద్యాసంస్థలు-విద్యార్థుల మధ్య సమన్వయం సాధించి.. అటు పరిశ్రమలకు నైపుణ్య మానవవనరులు అందించడం, ఇటు విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.

గత ఫిబ్రవరిలో తమ సంస్థలో శిక్షణ తీసుకున్న 32వేల మందిలో 5,700 మంది ఇన్ఫోసిస్‌ నిర్వహించిన పరీక్షలో ఎంపికయ్యారని తెలిపారు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల తర్వాత వీరిలో పలువురికి ఇన్ఫోసిస్‌ ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

బీటెక్‌ రెండు, మూడు సంవత్సరాలు చదువుతున్నవారు, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ విద్యార్థులు ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సులకు రిజిస్టర్‌ చేసుకోవచ్చని సూచించారు.