Group 2 Mains Exam : ఏపీ గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

Group 2 Mains Exam : పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.

Group 2 Mains Exam : ఏపీ గ్రూపు-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?

Appsc Group 2 Mains Exam Postponed to Feb 23

Updated On : November 12, 2024 / 9:45 PM IST

Group 2 Mains Exam : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష జరగాల్సి ఉంది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు.

ఈ ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు అభ్యర్థులు గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలకు ఏపీపీఎస్‌సీ (APPSC) అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.

Read Also : GATE 2025 Exam Schedule : గేట్ 2025 పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. వచ్చే ఫిబ్రవరి నుంచే ప్రారంభం.. పరీక్ష తేదీలివే!