గుడ్ న్యూస్ : 550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2019 / 03:41 PM IST
గుడ్ న్యూస్ : 550 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్

Updated On : February 12, 2019 / 3:41 PM IST

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి మంగళవారం(ఫిబ్రవరి-12,2019) ఏపీపీఎస్సీ ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది. 550 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జారీ అయిన నోటిఫికేషన్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు 330, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 100, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్లు 50 ఉన్నాయి. వీటితో పాటు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ సర్వేయర్లు 29, గిరిజన, బీజీ సంక్షేమశాఖలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 28, ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లో 18 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి.

డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఫిబ్రవరి 20నుంచి మార్చి 13వరకు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఫిబ్రవరి 27నుంచి మార్చి20వరకు, అటవీశాఖ ఉద్యోగాలకు మార్చి5నుంచి మార్చి27వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. కమిషన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది.