ఇద్దరితో కలిసి యువతిపై కానిస్టేబుల్ సామూహిక అత్యాచారం : అనంతలో దారుణం

  • Published By: nagamani ,Published On : July 7, 2020 / 11:21 AM IST
ఇద్దరితో కలిసి యువతిపై కానిస్టేబుల్ సామూహిక అత్యాచారం : అనంతలో దారుణం

Updated On : July 7, 2020 / 2:18 PM IST

ప్రజలకు ఆపద వస్తే కాపాడాల్సిన పోలీసు..నేరస్థులను పట్టుకుని కటకటాలల్లో వేసే పోలీసు దారుణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా బోయకొట్లాలలో ఓ పోలీసే కామాంధుడిగా మారాడు. ఓ యువతిని బెదిరించి మరో ఇద్దరితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు.

కొట్టాలపల్లి వద్ద స్నేహితుడితో మాట్లాడుతుండగా యువతి దగ్గరకు రాజశేఖర్ అనే వ్యక్తి వెళ్లి ఆమెను బెదిరించాడు. ఇష్టమొచ్చినట్లుగా ఎక్కడపడితే అక్కడ ఈ మీటింగ్ లేంటి పార్కులనుకుంటున్నారా?అంటూ బెదిరించాడు. పదా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని తీసుకెళ్లాడు. అలా ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా రాజశేఖర్ కోవూరులో తాను ఉంటున్న రూమ్ కు తీసుకెళ్లి నిర్భంధించాడు. ఆమె కేకలు పెడుతున్నా వినకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ సురేంద్రనాథ్‌కు ఫోన్ చేసి తన గదికి రమ్మన్నాడు. అతడితో కూడా యువతిపై అత్యాచారం చేయించాడు.

అయితే కొట్టాలపల్లి వద్ద యువతిని కలిసిన యువకుడికి అనుమానం రావడంతో అతడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేశాడు. జరిగిన విషయాన్ని వారికి చెప్పాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఏఆర్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. ప్రస్తుతం బాధితురాలు వారినుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను హాస్పిటల్ లో చేరప్పించి చికిత్సనందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా.. గతంలో కూడా ఇటువంటి దారుణాలు జరిగాయి.ఉరవకొండలో కూడా ఇలాగే ఓ పోలీసు ప్రేమికుల్ని నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించాడు. వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

Read Here>>క్లాస్‌మెట్‌కే ప్రేమ వల వేసి.. గుంటూరు యువతి కేసు కొలిక్కి!