ఎవరన్నా మంత్రి పేరో, ఎమ్మెల్యే పేరో చెప్పి బదీలీల కోసం డబ్బులు తీసుకుంటే వారిని..: అచ్చెన్నాయుడు వార్నింగ్
అటెండర్ నుంచి పెద్ద అధికారి వరకు ఎవరూ బదిలీలు కోసం డబ్బులు ఇవ్వద్దు, తీసుకోవద్దని..

Kinjarapu Atchannaidu On TDP Win
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఉద్యోగుల పైరవీలు జోరందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు అక్రమార్కులకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరన్నా మంత్రి పేరో, ఎమ్మెల్యే పేరో చెప్పి బదీలీల కోసం డబ్బులు తీసుకుంటే వారిని శిక్షిస్తానని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
అటెండర్ నుంచి పెద్ద అధికారి వరకు ఎవరూ బదిలీలు కోసం డబ్బులు ఇవ్వద్దు, తీసుకోవద్దని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. బదిలీలు జరుగుతున్నాయని, డబ్బులు తీసుకున్న వారి ముఖం చూడనని చెప్పారు. డబ్బులు ఇచ్చిన వారికి బదిలీ రాకుండా చూస్తానని హెచ్చరించారు.
అవసరమైతే పదిమందికి అడుక్కుని కార్యక్రమాలు చేస్తానని, అవినీతికి మాత్రం పాల్పడనని అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రిగా చెపుతున్నానని, నిక్కచ్చిగా బదిలీలు జరుగుతాయని, రికమండేషన్లుకు తావులేదని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు వేరే రూపంలో సాయం చేస్తానని, సహకరించాలని కోరారు. అందరికి సంతృప్తి పరచడానికి తాను దేవుడిని కాదని అన్నారు.
Also Read: వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు.. సీఎం రిలీఫ్ ఫండ్‌లో భారీ స్కామ్