Atchannaidu : పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయింది : అచ్చెన్నాయుడు

సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఉన్నారు.. వారేం అంటారు అని నిలదీశారు.

Atchannaidu : పవన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయింది : అచ్చెన్నాయుడు

Atchannaidu

Updated On : September 16, 2023 / 4:40 PM IST

Atchannaidu Serious YCP Leaders : సీఎం జగన్ పై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శిస్తే వైసీపీ నేతల ప్యాంటు తడిచిపోయిందని ఎద్దేవా చేశారు. పవన్ పొత్తు ప్రకటన చేయగానే సీఎం జగన్, మంత్రులు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. పొత్తు ప్రకటన తర్వాత వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ తో టీడీపీ పొత్తు ఖరారయ్యాక వైసీపీ నేతలు పోటీకి భయపడుతున్నారని పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం ఫేక్ అగ్రిమెంట్ అని సీఎం జగన్ ఎలా అంటారు అని ప్రశ్నించారు. తమ దగ్గర అగ్రిమెంట్ కుదుర్చుకున్న డాక్యుమెంట్ ఉంది.. అవసరమైతే జగనుకు పంపుతామని చెప్పారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెడుతున్నారని ఏదో అంటున్నారు.. కేబినెట్ మీటింగ్ కు వెళ్లేటప్పుడు రిజస్టర్ లో సంతకం చేసినా తప్పు అనేలా ఉన్నారని పేర్కొన్నారు.

CM Jagan: ఇన్నాళ్లు చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పేవాళ్లు లేరు.. చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు

సీఎం, మంత్రుల సంతకం లేకుండా ఫైళ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. గతంలో మంత్రులుగా పని చేసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఇప్పుడు కేబినెట్ లో కూడా ఉన్నారు.. వారేం అంటారు అని నిలదీశారు. తనపై ఉన్న కేసులకు జగన్ సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. తాము స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఆధారాలతో సహా వెబ్ సైట్ రూపొందించామని తెలిపారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జగన్ తో చర్చకు సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. ‘నువ్వు సిద్ధమా..?
ప్రస్తుతం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.. స్పెషల్ ఫ్లైట్ నీకేం కొత్త కాదుగా.. ఫ్లెటేసుకుని ఢిల్లీ వెళ్లి చర్చలో పాల్గొనగలవా..?’ అని సవాల్ చేశారు. జగన్ ఆస్తుల కేసులో అధికారులను జైలుకు పంపిన పొన్నవోలు.. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అధికారులకేం సంబంధం అంటారేంటీ అని నిలదీశారు.