Andhra Pradesh : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్

జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్‌ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Andhra Pradesh : ఆత్మకూరులో టెన్షన్..టెన్షన్

Atmakur

Updated On : January 9, 2022 / 6:42 AM IST

Atmakur High Tension : కర్నూల్ జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు వర్గాల మధ్య తలెత్తన ఘర్షణతో నగరమంతా హైటెన్షన్ నెలకొంది. 2022, జనవరి 08వ తేదీ శనివారం రాత్రి నుంచి ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఓ వర్గం చేపట్టిన నిర్మాణాన్ని బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు అతన్ని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌ రెడ్డి వాహనాన్ని మరోవర్గం వారు అడ్డుకున్నారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో వాహనం వేగంగా నడపడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ఆత్మకూర్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

Read More : Lottery Prize: లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తికి సగం ప్రైజ్ అమౌంట్ ఇచ్చిన 86ఏళ్ల మహిళ

విషయం తెలుసుకున్న మరోవర్గం వారు పోలీసు స్టేషన్‌ను దిగ్బంధించి శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఐదు బైకులకు నిప్పుపెట్టారు
ఆందోళనకారులు. దీంతో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో పదిహేను మందికి పైగా గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి చేజారిపోవడంతో.. జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్‌ రెడ్డి ఆత్మకూరు చేరుకున్నారు. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.