చీరాలలో మళ్లీ టెన్షన్ : ఆమంచి అనుచరుడిపై దాడి, ఎవరు చేశారు ?

చీరాలలో మళ్లీ టెన్షన్ : ఆమంచి అనుచరుడిపై దాడి, ఎవరు చేశారు ?

Updated On : March 7, 2021 / 6:49 AM IST

Amanchi krishna mohan : ప్రకాశం జిల్లాలో చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడు రాంబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లక్ష్మీ థియేటర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారణాయుధాలు, కర్రలతో దాడికి పాల్పడ్డారని రాంబాబు వెల్లడిస్తున్నారు. తీవ్రగాయాలైన అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు.

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి ప్రధాన అనుచరుడిగా రాంబాబు వ్యవహరిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమంచి అనుచరులు అక్కడకు చేరుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్ అతడిని పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టౌన్ మొత్తం పోలీసులు భారీగా మోహరించారు.