Andhra Pradesh : ఇద్దరు విద్యార్ధులను కాపాడిన ఆటో డ్రైవర్
విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు యత్నించారు. అది గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వారిని కాపాడాడు.

Auto driver who saved two students who tried to commit suicide
Andhra Pradesh : విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు యత్నించారు. అది గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వారిని కాపాడాడు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని పనాస్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు తమ పుస్తకాలు పోయాయని ఆందోళన చెందిన ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు యత్నించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆటో డ్రైవర్ వారిని రక్షించాటంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
నర్సరావు పేటలోని పనాస స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు తోట వినయ్,షేక్ ముస్తఫాలు. ఈ క్రమంలో వారి పుస్తకాలు పోగొట్టుకున్నారు.దీంతో ఉపాధ్యాయులు కొడతారనే భయంతో ఆందోళన చెందారు. పుస్తకాలు లేకపోయే చదువుకోవటం ఎలా? చదవకపోతే పరీక్షల్లో ఫెయిల్ అవుతాం. కాబట్టి చనిపోదాం అని అనుకున్నారు. అలా ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని మాట్లాడుకున్నారు. అలా ఆత్మహత్య చేసుకోవటానికి చీరాలకు వచ్చారు. చీరాలలోని పోర్టుకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
ఆ మాటలు విన్న ఓ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి..వారిని మాటల్లో పెట్టి తన ఆటో ఎక్కించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చాడు. అక్కడ పోలీసులకు అప్పగించి విషయం చెప్పాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఆటో డ్రైవర్ ను అభినందించారు. ఇద్దరు ప్రాణాలు కాపాడటమే కాదు ఇద్దరి కుటుంబాల్లో వెలుగులు నింపావు అంటూ అభినందించారు. ఆ తరువాత ఆ ఇద్దరు విద్యార్ధలు పేర్లు నోట్ చేసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.