రాజధానిలో బాబు : GN RAO కమిటీ అంటే..జగన్ మోహన్ రెడ్డి కమిటీ

GN RAO కమిటీకి కొత్త అర్థం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మోహన్ రెడ్డి కమిటీగా అభివర్ణించారు. ఎవరూ అడగకపోయినా..GN RAO కమిటీ వేశారని, ఈ కమిటీ నిబద్ధత ఏంటీ అని ప్రశ్నించారు. కమిటీకి జగన్ ప్రశ్నాపత్రం లీక్ చేస్తే..జీఎన్ రావు పరీక్ష రాశారని విమర్శించారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం తుళ్లూరులో రైతులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతులకు అండగా ఉంటానని హామీనిచ్చారు.
అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడ్ జరిగి ఉంటే..జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలని, హైకోర్టు ద్వారా ఇది జరగాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా తప్పు చేస్తే..శిక్షించాలని..కానీ అమరావతిని చంపేయడం దారుణమన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరిట అమరావతిని చంపేయడం అన్యాయమన్నారు. 2014, సెప్టెంబర్ 4 రాజధానిగా అమరావతిని జగన్ ఆహ్వానించారని, రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అన్నారని తెలిపారు. ఇప్పుడేమో..200 ఎకరాలు సరిపోతుందని అంటున్నారని విమర్శించారు. ఇప్పుడు జగన్ ఎందుకు మాట తప్పారు ? మడప తిప్పారు అంటూ నిలదీశారు.
అమరావతి ప్రజల కోసం ధర్మపోరాటం చేస్తున్నానని, రాజకీయం చేయడం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని, ఈ ప్రాంతం (అమరావతి)లో ఇచ్చిన మాటను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖకు రైల్వే జోన్ రావాలని అంటే..అందరూ సహకరించారని అనే విషయాన్ని గుర్తు చేశారు. జీఎన్ రావు కమిటీ ఎక్కడైనా రాజధాని ప్రాంతాల్లో పర్యటించారా అని ప్రశ్నించారు. రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలకు పార్టీలు మద్దతిస్తున్నాయని వెల్లడించారు. రాజధాని ఇక్కడే ఉండేవరకు పూర్తిగా అండగా ఉంటానని జగన్ హామీనిచ్చారు.
* అవినీతి పేరు చెప్పి అమరావతిని చంపేస్తున్నారు.
* విశాఖపట్టణానికి టీడీపీ వ్యతిరేకం కాదు.
* ఎక్కువ ఇష్టపడే నగరం విశాఖపట్టణం
* విశాఖకు టీడీపీ వ్యతిరేకం కాదు.
మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదిక ఇవ్వడంపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారానికి ఆరో రోజు చేరుకుంది. వినూత్నంగా నిరసలు, ఆందోళనలు చేస్తున్నారు.
Read More : రాజధాని రగడ : రైతులను చూస్తుంటే బాధేస్తోంది..తుళ్లూరులో బాబు