Badvel by-election: బద్వేల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం.. ప్రధాన అభ్యర్థులు వీరే!?
కడప జిల్లా బద్వేల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఉపఎన్నిక ఇవాళ(30 అక్టోబర్ 2021) జరగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

Ycp
Badvel by-election: కడప జిల్లా బద్వేల్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఉపఎన్నిక ఇవాళ(30 అక్టోబర్ 2021) జరగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కలెక్టరు విజయరామ రాజు, రిటర్నింగ్ అధికారి, రాజంపేట సబ్ కలెక్టరు కేతన్‌గార్గ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పీఎం కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ చెయ్యట్లేదు. అయితే, జనసేన సపోర్ట్ తమకు ఉందంటూ బీజేపీ చెబుతోంది. మొత్తం ఓటర్లు 2,15,292 కాగా.. వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355మంది, థర్డ్ జండర్ 22 మంది ఉన్నారు.
అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. సాంప్రదాయం ప్రకారం.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.