Balakrishna – Chamdrababu : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో చాలా పాలిటిక్స్, కాంట్రవర్సీలు కూడా మాట్లాడారుగా.. చంద్రబాబు ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో..
ప్రోమోతోనే ఓ రేంజ్ లో వైరల్ అవ్వగా ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడే మాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో, రాజకీయంగా ఎలాంటి చర్చలకు దారులు తీస్తాయో అని చర్చించుకుంటున్నారు.

Balakrishna and Chandrababu Naidu Discuss Sensational and Controversy Topics in Aha Unstoppable Show Telugu States Waiting for Episode
Balakrishna – Chamdrababu : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి మొదలు కానుంది. మొదటి ఎపిసోడ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. నిన్న ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేసారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు పాలిటిక్స్, ఏపీ కాంట్రవర్సీలు, పవన్ కళ్యాణ్, ఫ్యామిలీ.. ఇలా అనేక అంశాల గురించి మాట్లాడారు.
అయితే ప్రోమోలో చంద్రబాబు జైలు జీవితం, పవన్ కళ్యాణ్ తో స్నేహం, ఏపీ రాజకీయాలు.. ఇలాంటి పాయింట్స్ కూడా చూపించారు. అలాగే షోలో ఏం మాట్లాడారు అని కొన్ని లీకుల ద్వారా కూడా బయటకు వచ్చాయి. లోకేష్, ఎన్టీఆర్, టిడిపి వారసత్వం ఇలాంటి అంశాల గురించి కూడా మాట్లాడారు. అయితే ఏపీ రాజకీయాల గురించి, ఎన్నికల ముందు వివాదాల గురించి కూడా అనేక ప్రశ్నలు అడిగారని సమాచారం.
జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? ఆయన్ని కూడా కటకటాలపాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కసి వచ్చిందా? మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్ ఏంటి? అని బాలయ్య అడిగారట. జైలు జీవితం చంద్రబాబులో మరో మనిషిని నిద్ర లేపిందా? జగన్ తీవ్ర పర్యవాసానాలు చూడబోతున్నారా? స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో సీఎం చంద్రబాబు ఏం చెప్తారు అని ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలు కూడా బాలయ్య అడిగారట. వీటికి చంద్రబాబు సమాధానం ఏం ఇచ్చారో అని ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. దీంతో చంద్రబబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కున్న వాటికి సమాధానాలు ఈ షోలో చెప్తారేమో అని తెలుస్తుంది.
అలాగే బాలయ్య.. నిర్ణయం తీసుకోవడంలో అచితూచి వ్యవహరించే చంద్రబాబు, గత అయిదేళ్ల పరిణామాలు చూసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులతో దూకుడుగా సమాధానమిస్తారా లేదా ఎప్పటిలాగే ఉంటారా? 53 రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు ఓ నిందితుడిగా జైల్లో ఉండటంతో ఎలా ఫీలయ్యారు? రాజమండ్రి జైల్లో VIPగా ఉన్నారా? రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల నుంచి చూసిన ప్రపంచం ఎలా ఉంది? అప్పుడు ఏం చదివారు? ఏం చూసారు? కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి అనే ప్రశ్నలు అడగ్గా చంద్రబాబు వీటికి ఎమోషనల్ అయ్యారట.
అలాగే.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు గురించి, రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో నాలుగుగోడల మధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చలేంటి? ఆ పొత్తు ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత వచ్చిన ప్రకటనా? లేదా పవన్ ఎమోషన్‌లో తీసుకున్న నిర్ణయమా? అని పొత్తుకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగారట. భవిష్యత్తులో టీడీపీని సమర్థవంతగా నడపగల శక్తి లోకేష్ కి ఉందా? జూనియర్ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏం అన్నారు అనేది కూడా ఎపిసోడ్ లో ఉండబోతుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో జనసేన, టీడీపీ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? అమరావతి రాజధాని విషయం.. ఇలా అనేక వివాదాస్పద, ఆసక్తికర ప్రశ్నలు బాలయ్య అడిగారట.
ఇక పాలిటిక్స్ పక్కన పెడితే.. లోకేష్, పవన్‌కల్యాణ్, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? అడ్మినిస్ట్రేషన్, కుటుంబవ్యవహరాల్లో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలకు ఎన్ని మార్కులు ఇస్తారు? కిరాణా సామాన్లు కొనాలి అంటూ సరదా ప్రశ్నలు, ఆటలు కూడా ఆడించారు బాలయ్య చంద్రబాబుతో. దీంతో ఈ ఎపిసోడ్ పై నందమూరి, టీడీపీ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రోమోతోనే ఓ రేంజ్ లో వైరల్ అవ్వగా ఎపిసోడ్ లో సీఎం చంద్రబాబు మాట్లాడే మాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో, రాజకీయంగా ఎలాంటి చర్చలకు దారులు తీస్తాయో అని చర్చించుకుంటున్నారు.