హిందూపురం దశ తిరగబోతోంది.. ఏమేం కంపెనీలు వస్తున్నాయో చెప్పిన బాలయ్య
హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని అన్నారు.

Nandamuri Balakrishna
Balakrishna: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ ఇవాళ తన నియోజక వర్గంలో సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా గడిపారు. అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు.
హిందూ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తానని బాలయ్య అన్నారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని తెలిపారు. డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
Also Read: బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఇక ఈ బీరు దొరకడం కష్టమే..!
ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేస్తామని బాలకృష్ణ చెప్పారు. హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని అన్నారు.
హిందూపురం ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారని బాలకృష్ణ చెప్పారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్ సిటీ పరిశ్రమలు రానున్నాయని అన్నారు.
కొత్త పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతి, యువకులకే అవకాశం కల్పిస్తానని బాలకృష్ణ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోయే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తనదని చెప్పారు. భూములు కోల్పోయే రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు.