Baskar Reddy: బాలినేనితో విబేధాలుంటే రాజకీయంగా తేల్చుకోండి.. నా వ్యాపారాల జోలికి రావొద్దు ..

ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియ్యకుండు భాస్కర్ రెడ్డి అన్నారు. బాలినేనితో ఏమైనా రాజకీయ విబేధాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, నా వ్యాపారాల జోలికి రావొద్దన్నారు. నాపై ఇటువంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా తేల్చుకుంటానని చెప్పారు.

Baskar Reddy: బాలినేనితో విబేధాలుంటే రాజకీయంగా తేల్చుకోండి.. నా వ్యాపారాల జోలికి రావొద్దు ..

Balineni Srinivas Reddy's relative

Updated On : April 4, 2023 / 1:53 PM IST

Baskar Reddy: మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ఏమైనా రాజకీయ విబేధాలు ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలని, నా వ్యాపారాల జోలికి రావొద్దంటూ బాలినేని వియ్యంకుండు భాస్కర్ రెడ్డి అన్నారు. కొద్దిరోజులుగా వైజాగ్ ఫారెస్ట్ భూముల వివాదంలో భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో వైజాగ్ ఫారెస్ట్ భూముల వివాదంపై భాస్కర్ రెడ్డి స్పందించారు. నేను 2004లో కొనుగోలు చేసిన అనంతరం లేఅవుట్‌కు అనుమతులకోసం అప్లై చేయగా 2009లో అప్రోవల్‌కు అనుమతులు వచ్చాయని తెలిపారు. అప్రోవల్ ఇచ్చే నాటికి బాలినేనితో తమకు ఎటువంటి బందుత్వం లేదని భాస్కర్ రెడ్డి తెలిపారు.

Balineni Srinivasa Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహిస్తాం: బాలినేని శ్రీనివాస రెడ్డి

2011లో నా కూతురుని బాలినేని కుమారుడికి ఇచ్చానని, పొలిటికల్ సఫరర్స్ భూములను కొనుగోలు చేయవలసిన నీచమనస్థత్వం తమది కాదని అన్నారు. ఫారెస్ట్, పొలిటికల్ సఫరర్స్ భూములు ఆక్రమించారనే ఆరోపణలు అవాస్తవమని అన్నారు. దీనిపై ఎటువంటి విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నానని బాలినేని వియ్యకుడు భాస్కర్ రెడ్డి అన్నారు. అడవి జంతువులు తమ లేఅవుట్‌లోకి రాకుండా ఉండేందుకే తాము కాంపౌండ్ వాల్ నిర్మించామని తెలిపారు.

Balineni Srinivasa Reddy : నీ సంస్కృతి మార్చుకోకపోతే ప్రజలే నీ తాట తీస్తారు.. దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్

ఒక్క సెంట్ ఆక్రమించానని నిరూపించినా ఆ ల్యాండ్ మెత్తాన్ని ప్రభుత్వానికి రాసిస్తానని భాస్కర్ చెప్పారు. నేను బాలినేని కుమారుడికి పిల్లను ఇచ్చినంత మాత్రాన వ్యాపారం చేయకుడదా అంటూ ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని, బాలినేనితో రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయంగా తేల్చుకోండి. అంతేకాని నా వ్యాపార ప్రాజెక్టు‌లతో ముడిపెట్టడం మంచి పద్దతి కాదని భాస్కర్ రెడ్డి అన్నారు. ఇకపై ఇటువంటి ఆరోపణలు చేస్తే చట్టపరంగా తేల్చుకుంటానని చెప్పారు.