Balineni Srinivasa Reddy: జనసేనలో బాలినేనికి ఊహించని పరిస్థితులు..!?
జయమంగళ రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయితే ఎమ్మెల్సీ స్థానం బాలినేనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట పవన్.
Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా.. సీనియర్ పొలిటీషియన్‌గా పేరున్న బాలినేని ఒంగోలులో మంచి పట్టున్న నేత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీలో అసంతృప్తిగానే కొనసాగారు బాలినేని.
గత ఎన్నికల తర్వాత..జనసేన గూటికి చేరారు. వైసీపీలో మంత్రిగా పనిచేసినా..తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని..రెండున్నరేళ్లు మాత్రమే మంత్రి ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ చాలాసార్లు అలకపాన్పు ఎక్కారు. ఎన్నికలకు ముందే జనసేనలో చేరాలని అనుకున్నా సమీకరణాలు సెట్ అవ్వకపోవడంతో వెయిట్ చేశారు.
ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ నేరుగా బాలినేనిని పార్టీలోకి తీసుకున్నారు. ఆయన కూడా ఉత్సాహంగా జనసేనలో చేరారు. బాలినేని జనసేనలో చేరి ఏడాది దాటినా ఇప్పటికీ పార్టీలో సెట్ అయిపోలేదట. పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు అటు వైసీపీ నేతలు అప్పుడప్పుడు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Also Read: వేణుస్వామి పూజలు చేసినందుకే సినీనటి ప్రగతికి మెడల్స్ వచ్చాయా? ఆమె ఏమన్నారంటే? ఖతర్నాక్ రియాక్షన్..
ఇటు కూటమి పార్టీల లీడర్లు కూడా.. బాలినేని వైసీపీ కోవర్ట్ అంటూ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు జిల్లాలో బాలినేనికి పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదట. అక్కడున్న లోకల్ టీడీపీ లీడర్లు బాలినేనికి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇక జనసేన మెల్లిగా బాలినేనిని ఓన్ చేసుకుంటున్నా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు, ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తున్నాయ్.
ఇవన్నీ గమనించిన పవన్ కల్యాణ్ బాలినేనిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారట. బాలినేనికి రెండు వైపులా ఇబ్బందులు ఉన్నాయని పవన్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పైగా అన్నీ తట్టుకుని నిలబడుతున్నారంటూ బాలినేనిని అభినందించారు పవన్. దీంతో అధినేత మనసులో చోటు సంపాదించుకున్న బాలినేనికి త్వరలోనే ఏదో ఒక పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ టైమ్‌లో ఈక్వేషన్స్ కుదరలేదు!
బాలినేనిని పార్టీలోకి తీసుకున్నప్పుడే ఆయనకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇవ్వాలనుకున్నారట పవన్. ఆ టైమ్‌లో ఈక్వేషన్స్ కుదరలేదంటున్నారు. నాగబాబును మండలికి పంపడంతో జనసేనకు అవకాశం లేకుండా పోయిందట. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ స్థానాన్ని బాలినేనికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
ఆ బెర్త్ విషయంలో కూడా చిక్కు వచ్చి పడింది. జయమంగళ వెంకటరమణ రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించకుండా చాలా కాలంగా పెండింగ్‌లో పెట్టారు. ఈ అంశం ఇప్పుడు కోర్టు పరిధిలోకి వెళ్లింది. జయమంగళ రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయితే ఎమ్మెల్సీ స్థానం బాలినేనికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట పవన్.
అయితే మండలి ఛైర్మన్ ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారోనని బాలినేని ఎదురుచూడక తప్పట్లేదు. దీంతో మొత్తానికి బాలినేనికి టైమ్ బాలేదన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో ఉన్నానన్న ఫీల్ లేకుండా పోయిందంటున్నారు. వైసీపీలో ఎలా అయితే ఇబ్బంది పడ్డారో జనసేనలో కూడా అంతకు మించి ఇబ్బందులు పడుతున్నారట బాలినేని. అయితే జనసేన అధినేత పవన్ సాఫ్ట్ కార్నర్‌తో ఉండటం బాలినేనికి కలిసొచ్చే అంశమంటున్నారు. బాలినేనికి కోరుకున్న పదవి దక్కేదెప్పుడో చూడాలి మరి.
