వేణుస్వామి పూజలు చేసినందుకే సినీనటి ప్రగతికి మెడల్స్ వచ్చాయా? ఆమె ఏమన్నారంటే? ఖతర్నాక్ రియాక్షన్..
టైమ్ బాగోలేకపోతే ఇటువంటి జ్యోతిష్యాలనే కాకుండా అన్నింటినీ నమ్ముతామని చెప్పారు. ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని..
Pragathi
Actress Pragathi: పవర్ లిఫ్టింగ్‌లో సినీనటి ప్రగతి నాలుగు మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆమె వెయిట్ లిఫ్టింగ్‌లో గెలవాలని కోరుకుంటూ తన వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకున్నారని దాని ఫలితంగానే ఆ పతకాలు సాధించారని ఇటీవల జోతిష్కుడు వేణు స్వామి అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అయింది.
వేణస్వామి చేసిన అటువంటి కామెంట్లపై ప్రగతి స్పందించారు. 10టీవీ పాడ్‌కాస్ట్‌లో ప్రగతి మాట్లాడుతూ.. “రెండున్నరేళ్ల ముందు నేను చాలా లో పాయింట్‌లో ఉన్నాను. వర్క్ అంత ఇదిగా లేదు. సో ఆ పాయింట్‌లో నేను వేణుస్వామి వద్దకు వెళ్లాను. మా ఫ్రెండ్స్ రెఫర్ చేస్తే వెళ్లాను” అని అన్నారు.
Also Read: తట్టుకోలేకపోయాను.. అందుకే చనిపోతున్నానని చెప్పాను: సినీనటి ప్రగతి
ఆ టైమ్‌లో (పరిస్థితులు బాగోలేనప్పుడు) అటువంటివి చేయించుకోవాలన్న ఆలోచన వచ్చేస్తుందని ప్రగతి చెప్పారు. “ఏదో పూజ చేశారు.. నాకు పెద్ద ఫలితం ఏమీ కనపడలేదు. ఏడాది క్రితం జరిగి ఆ పూజల ఫొటో ఇప్పుడు వాడారు. ఇక నేను ఏం చెప్పాలి. పూజలు చేయించాక నాకేం పెద్ద తేడా తెలియలేదు” అని అన్నారు. “ప్రగతి మెడల్స్ సాధించడానికి నేనే కారణం” అంటూ వేణుస్వామి చేస్తున్న కామెంట్లను ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని ఆమె తెలిపారు.
టైమ్ బాగోలేకపోతే ఇటువంటి జ్యోతిష్యాలనే కాకుండా అన్నింటినీ నమ్ముతామని చెప్పారు. ఈ పూజల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని మాత్రం తనకేమీ అనిపించలేదని తెలిపారు.
