Bandi Sanjay: చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీపై ఏపీ ప్రజల్లో..: బండి సంజయ్

ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ఏంటని బండి సంజయ్ నిలదీశారు.

Bandi Sanjay: చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీపై ఏపీ ప్రజల్లో..: బండి సంజయ్

BJP MP Bandi Sanjay

Updated On : September 12, 2023 / 8:26 PM IST

Bandi Sanjay – Chandrababu Arrest: టీడీపీ (TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై తెలంగాణ ఎంపీ, బీజేపీ (BJP) నేత బండి సంజయ్ స్పందించారు. ఆయనను ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విధానం సరికాదని చెప్పారు.

ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం ఏంటని బండి సంజయ్ నిలదీశారు. చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదని బండి సంజయ్ అన్నారు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం వెనుక కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

KTR: అందుకే తెలంగాణ ఎన్నికలు ఆలస్యం కానున్నాయా? కేటీఆర్ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా?