YS Viveka Case: వైఎస్ వివేక హత్యకు కుట్ర పన్నింది భాస్కర్ రెడ్డే: సీబీఐ రిపోర్టులో సంచలన విషయాలు

YS Viveka Case: సీబీఐ రిపోర్టు ద్వారా సంచలన విషయాలు బయటకువచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన కస్టడీ రీపోర్టులోని అంశాలు 10 టీవీకి చేతిలో ఉన్నాయి.

YS Viveka Case: వైఎస్ వివేక హత్యకు కుట్ర పన్నింది భాస్కర్ రెడ్డే: సీబీఐ రిపోర్టులో సంచలన విషయాలు

YS Viveka Case

Updated On : April 16, 2023 / 7:16 PM IST

YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి కేసు (YS Viveka Case)కు సంబంధించి సీబీఐ రిపోర్టు ద్వారా సంచలన విషయాలు బయటకువచ్చాయి. సీబీఐ (CBI) దాఖలు చేసిన కస్టడీ రీపోర్టులోని అంశాలు 10 టీవీకి చేతిలో ఉన్నాయి. భాస్కర్ రెడ్డిని కస్టడీకి అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. 10 రోజుల పాటు భాస్కర్ రెడ్డిని కస్టడీకి తీసుకుంటామని చెప్పింది. 2019, మార్చి 15న జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డి కిలక పాత్ర పోషించారని సీబీఐ తెలిపింది.

నేర పూరిత కుట్రతో పాటు హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పేర్కొంది. వైఎస్ వివేకానంద రెడ్డిపై శివ శంకర్ రెడ్డి కక్ష పెంచుకున్నారని చెప్పింది. హత్యకు పథకం రచించింది భాస్కర్ రెడ్డి అని పేర్కొంది. సాక్ష్యాలు తారు మారు చెయ్యడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పింది. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన సమాచారం మేరకు భాస్కర్ రెడ్డిని ఆరెస్ట్ చేశామని పేర్కొంది.

40 కోట్ల రూపాయల ఒప్పందంతోనే హత్య జరిపినట్లు దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడని తెలిపింది. కోటి రూపాయల నగదును సునీల్ యాదవ్ కు భాస్కర్ రెడ్డి ఇచ్చారని పేర్కొంది. కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై రేపు కోర్టు విచారించనుంది. భాస్కర్ రెడ్డిని అనేక కోణాల్లో విచారించాలని సీబీఐ పేర్కొంది.

కాగా, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఇవాళ సీబీఐ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన ఫోనును అధికారులు సీజ్ చేశారు. భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది.

YS Viveka Case: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్