Ration Distribution: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే రేషన్ పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎక్కడెక్కడ అంటే..
ఈ 12 జిల్లాలకు గాను 14వేల 145 రేషన్ షాపులు ఉదయం నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
Ration Distribution: మొంథా తుపాను నేపథ్యంలో రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడే రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. తుపాను ప్రభావిత 12 జిల్లాల్లో రేషన్ పంపిణీ జరగనుంది. ఈ జిల్లాల్లో మొత్తం 14వేల 105 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా లబ్దిదారులకు రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. 7లక్షల మంది లబ్దిదారులకు ఉపయోగపడేలా నిత్యవసరాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే నిత్యవసరాలను రేషన్ షాపులకు చేర్చామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
”సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి లబ్దిదారులకు పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తుంటాం. దాన్ని సవరించి నేడే రేషన్ పంపిణీ చేస్తాం. ఉదయం 9 గంటల నుంచే 12 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి.. ఈ 12 జిల్లాలకు గాను 14వేల 145 రేషన్ షాపులు ఇవాళ ఉదయం నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
సుమారు 7లక్షల మంది కార్డు హోల్లర్లు లబ్ది పొందొచ్చు. వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించే సరుకులు, బియ్యం, పంచదార ఇవాళ ఉదయం నుంచే అందుబాటులోకి వచ్చే విధంగా మేము సిద్ధమవుతున్నాం. ఈ సరుకులు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మేము చేర్చేశాం. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు” అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
అటు మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి 3వేల చొప్పున నగదు ఇవ్వాలన్నారు. అలాగే 25 కిలోల బియ్యం సహా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాల్లో తుఫాన్ రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వాలంటరీగా వచ్చే వారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా నిబద్ధతతో పని చేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
Also Read: తుపాను ఎఫెక్ట్.. ఏపీ ఆర్టీసీ హైఅలర్ట్.. ఆ ప్రాంతాలకు బస్సులు నిలిపివేత..!
