Share Market Fraud : లక్షకు రూ.15 లక్షలు వడ్డీ..! విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం
విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. తక్కువ సమయంలోనే లక్షకు 15 లక్షల రూపాయల వడ్డీ వస్తుందంటూ..

Share Market Fraud
Share Market Fraud : విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం చోటు చేసుకుంది. మూడు లక్షలు పెట్టుబడి పెడితే చాలు నెలకు 45000 వస్తుందంటూ మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా తక్కువ సమయంలోనే లక్షకు 15 లక్షల రూపాయల వడ్డీ వస్తుందంటూ మోసం చేశారు. డబ్బులు కట్టిన తర్వాత సంస్థ ప్రతినిధులు ముఖం చాటేశారు.
Hyd Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసు నిందితుడు.. పోలీస్ అధికారి కొడుకు..?
మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే పని మొదలుపెట్టారు. ఈ కేసులో పెనమలూరు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
ANVS సర్వీసెస్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసిందని బాధితులు తెలిపారు. హాసన్న, హర్ష కుమార్, జ్ఞానేశ్వర్ లు పార్టనర్లుగా ఉండేవారని పోలీసులతో చెప్పారు. ఇప్పటివరకు సుమారుగా రూ.15 కోట్లు మోసం చేసినట్టు పోలీసులు లెక్కకట్టారు.