MLC Ananthababu..Driver Murder Case : ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు బెయిల్ కు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్ధేశిస్తుంది అని వెల్లడించింది.

MlC Anantha babu supreme court granted bail in former driver murder case
MLC Ananthababu..Driver Murder Case : తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎట్టకేలకు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు బెయిల్ కు సంబంధించిన నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్ధేశిస్తుంది అని వెల్లడించింది. తరువాత విచారణను 2023 మార్చి 14కు వాయిదా వేసింది. కాకినాడలో మే 19న అనంతబాబు తన మాజీ డ్రైవర్ హత్యకు గురి అయ్యాడు. తన పుట్టిన రోజు వేడులకు తీసుకెళ్లిన అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన తన కారులోనే శవాన్ని తీసుకొచ్చి వారి ఇంటిముందు దింపుపోయాడనే ఆరోపణలో అరెస్ట్ అయిన అనంతబాబు జైల్లోనే ఉంటున్నారు. ఈక్రమంలో బెయిల్ కోసం పలుమార్లు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఈక్రమంలో ఎట్టకేలకు అనంతబాబు యత్నాలు ఫలించి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన అనంతమాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంటున్నారు. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై సెప్టెంబర్ 26న ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురైంది. బెయిల్ పిటీషన్ని కోర్టు కొట్టివేసింది. రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టుతో సహా ఏపీ హైకోర్టుల్లో కూడా అనంతబాబు బెయిల్ యత్నాలు ఫలించలేదు. దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేస్తున్నట్లు గతంలో పేర్కొంది. ఈ మేరకు నేడు విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అనంతబాబుకు భారీ ఊరట లభించింది.