BJP Focus On Second List : సెకండ్ లిస్ట్‌పై బీజేపీ కసరత్తు.. ఏపీలో పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఏపీలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరపనున్నారు.

BJP Focus On Second List
BJP Focus On Second List : త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితా విడుదలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ హైకమాండ్, కోర్ గ్రూప్ సభ్యులు సమావేశం అయ్యారు. ఏపీ, ఒడిశా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు.
బీజేపీ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి సంతోశ్, ఏపీ ఇంఛార్జి శివప్రకాశ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు హాజరయ్యారు. ఏపీలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇవాళ కూడా మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు.
బీజేపీ తాజా సమావేశంలోనూ పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులపై అధిష్టానానికి వివరించామన్నారు. ఏపీలో జరిగిన బీజేపీ సమావేశంపై నివేదికతో పాటు ఆశావహుల జాబితాలను కూడా అందించామన్నారు. పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు ఏపీ బీజేపీ నేత సోమువీర్రాజు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పరిస్థితులపై చర్చించినట్లు సోమువీర్రాజు వెల్లడించారు.
Also Read : టీడీపీలో కొత్త తరహా రాజకీయం.. ఎలాంటి నష్టం జరుగుతుందో అనే ఆందోళనలో అధిష్టానం