3 హైకోర్టులు, 3 అసెంబ్లీలు, 3 సచివాలయాలు పెట్టండి : బీజేపీ నేత కొత్త డిమాండ్

ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 04:15 AM IST
3 హైకోర్టులు, 3 అసెంబ్లీలు, 3 సచివాలయాలు పెట్టండి : బీజేపీ నేత కొత్త డిమాండ్

Updated On : February 4, 2020 / 4:15 AM IST

ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని

ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికార వికేంద్రీకరణతో లాభం లేదంటున్నాయి. ప్రభుత్వం మాత్రం.. మూడు ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా అధికార వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది. ఎవరు కాదన్నా.. మూడు రాజధానులు కన్ ఫర్మ్ అంటోంది.

తాజాగా మూడు రాజధానుల అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. అధికార వికేంద్రకరణను తప్పుపట్టిన టీజీ.. తప్పదని అనుకుంటే.. మూడు ప్రాంతాల్లోనూ అంటే కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో మూడు హైకోర్టులు, మూడు అసెంబ్లీలు, మూడు సచివాలయాలు పెట్టాలని డిమాండ్ చేశారు. మూడు ప్రాంతాల్లోనూ అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. తనకు మూడు ప్రాంతాలు సమానమే అని టీజీ చెప్పారు. మూడు ముక్కలాట నడవదన్న టీజీ.. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశారు. ఒక్కో చోట ఒక్క వింగ్ ఉంటే.. ప్రయోజనం లేదన్నారు.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అధికార వికేంద్రీకరణ సమానంగా జరగాలని టీజీ కోరారు. కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం ఉండాలన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలతోనూ తనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నారు. రాయలసీమలో నేను పుట్టాను, అమరావతి మా మామ ఊరు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి నా కూతురిని ఇచ్చానని టీజీ వ్యాఖ్యానించారు.

టీజీ కామెంట్స్:
* ముడు ముక్క లాట నడవదు
* మూడు ప్రాంతాల్లో మూడు వింగ్ లు ఉండాల్సిందే
* ఒక వింగ్ మాత్రమే పెడతాను అంటూ సరికాదు
* అమరావతి మా మామ ఊరు

* ఉత్తరాంధ్ర మా బిడ్డను ఇచ్చిన ఊరు
* నేను రాయలసీమలో పుట్టాను
* మూడు ప్రాంతాలు బాగుండాలని కోరుకునే వాడిని
* నా బిడ్డ కోసం, నా భార్య కోసం, నా కోసం అడుగుతున్నా

* మూడు ప్రాంతాల్లో మూడూ పెట్టండి
* కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలో హైకోర్టు బెంచ్, మినీ సెక్రటేరియల్, అసెంబ్లీ పెట్టండి