BJP Leaders : జేపీ నడ్డాను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు : బీజేపీ నేతలు
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.

BJP Leaders
Visakha Public Meeting : వైసీపీ నేతలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆవ భూముల్లో ఎంత అవినీతి జరిగిందో కౌన్సిల్ లో తాను మాట్లాడానని చెప్పారు.
ఏపీలో భూ మాఫియా ఎక్కువైపోయిందని తెలిపారు. రాష్ట్రంలో అడుగడుగునా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి నైతిక స్థాయి ఉందన్నారు. ఈ అంశాలపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నానని చెప్పారు. ఆదివారం విశాఖలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి 9 సంవత్సరాల్లో తాము చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని…అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తోందన్నారు. 2014లో ప్రజలు వైసీపీపై ఉమ్మేశారా? పట్టభధ్రుల ఎన్నికల్లో కూడా వైసీపీపై ఉమ్మేశారా? అని వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీ నేత సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అన్ని స్కాములపై చర్చకు సిద్ధమన్నారు.
ఒక్కో రోజు ఒక్కో స్కామ్ కోసం చర్చకు కూర్చుందామని తెలిపారు. నిరూపించకపోతే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ‘పేర్ని నాని నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావ్? జగన్ మోహన్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారు? అని ప్రశ్నించారు. ఏది పడితే అది మాట్లాడితే.. అన్నీ బయటకు వస్తాయన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం పని చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి నానిపై విమర్శలు చేశారు.
Perni Nani : టీజేపీగా మారిన బీజేపీ.. వారి మాటలు వింటే ఒక్క సీటు కూడా గెలవరు : పేర్ని నాని
‘మాజీ మంత్రి నాని నీ బండి షెడ్డులో ఉంది కదా? నిజాలు మాట్లాడితే బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారు @YSRCParty నానిలు… పనికి మాలిన వాళ్లనే కదా మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి పీకేసింది? నోరు చేసుకోవడాకి తప్ప ఎందుకూ పనికి రారనే కదా మిమ్మల్ని షెడ్డుకు పంపింది? ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన @BJP4India అధ్యక్షుడు జేపీ నడ్డాపై మీరు కూడా మాట్లాడేవారేనా? ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం.. ఇప్పుడే ఏమైంది.. ముందుంది ముసళ్ల పండగ’ అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.