Suajna Chowdary : 29 గ్రామాలది కాదు, రాజధాని అమరావతిపై బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్
ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు.

Sujana Chowdary
Sujana Chowdary : ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు. ఒకసారి ఓటెయ్యండన్న జగన్ అసలు స్వరూపం బయడపడిందన్నారు. కక్ష్య సాధింపుతోనే పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ లాగానే ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ రావాలన్నారు.
Burning Plastic – Garbage: బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదా ప్లాస్టిక్ కాలిస్తే రూ.5వేల ఫైన్
న్యాయస్ధానం నుంచి న్యాయం మనకు కనబడుతుందని, ఇంక ఎవరూ ఆపలేరని అన్నారు. లక్ష కోట్ల సంస్ధలకు కేంద్రం అప్రూవల్ ఇచ్చిందని సుజనా చౌదరి చెప్పారు. వేల కోట్లు అమరావతిలో వేయడం జరిగిందని, రైతులకు ఒక్క రూపాయి నష్టం జరగదని అన్నారు. దేవస్ధానానికి వెళ్లే లోపలే జగన్ మెడలు వంచైనా రాజధానిపై ప్రకటన చేయిస్తామని సుజనా చౌదరి అన్నారు.
Instant Covid Test : కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు… ఇదిగో ప్రాసెస్..!
అమరావతి రైతుల పాదయాత్రకు బీజేపీ నేతలు ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి వచ్చిన వారికి రైతులు దారిపొడవునా కండువాలు వేసి స్వాగతం పలికారు. రాజధాని ఎక్కడికీ పోదని, అమరావతే ఏపీ రాజధాని అంటూ తాము మొదటి నుంచి ఇదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు సుజనా చౌదరి. సాంకేతిక, న్యాయపరమైన అంశాలు చూసే తాను ఆనాడు మాట్లాడానన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం సూచనతోనే నేతలంతా పాదయాత్రకు వెళ్తున్నామన్నారు. ఏ క్షణమైన రాజధాని తరలిపోతుందని చెప్పే వార్తలను తాము పట్టించుకోమని సుజనా చౌదరి స్పష్టం చేశారు.