కృష్ణా నదిలో ఇరుక్కుపోయిన లాంచీ, 4 గంటలు నరకం చూసిన ప్రయాణికుల.. తర్వాత ఏమైందంటే..
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ..

Boat Stuck In Krishna river : కృష్ణా నది మధ్యలో ఒక లాంచీ నిలిచిపోయింది. 25 మందితో వెళ్లిన లాంచీ ఇసుక దిబ్బలు తగలడంతో ఆగిపోయింది. రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఏకంగా 4 గంటల పాటు కృష్ణా నదిలోనే లాంచీ ఉండిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు నాలుగు గంటల పాటు నరకం చూశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పడవలతో వెళ్లి కాపాడారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read : టీడీపీకి ఈసీ లొంగిపోయింది, అందుకే అక్కడ హింసాత్మక ఘటనలు- పేర్నినాని