కుళ్లుకుంటూ.. రాక్షస ఆలోచనలు చేస్తున్నారు : మంత్రి బొత్స

కుళ్లుకుంటూ.. రాక్షస ఆలోచనలు చేస్తున్నారు : మంత్రి బొత్స

Updated On : September 12, 2019 / 1:41 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ పాలన చూసి కుళ్లుకుని ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగులతోనే టీడీపీ ఇలాంటి కుట్రలకుపాల్పడుతోందని విమర్శించారు. 

తమకు ఏపీ సీఎం జగన్ శాంతిభద్రతల విషయంలో రాజీపడొద్దని సూచించారని తెలియజేశారు. చంద్రబాబు పాలనలో ఇలాంటివేమీ కనిపించలేదన్నారు.  ప్రతిపక్షం పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి రాజకీయాలు చేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగాయని గుర్తు చేశారు. 

ముఖ్యమంత్రి చెప్పిన దానిని బట్టే సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని పేర్కొన్నారు. మేనిఫెస్టోకు అనుగుణంగానే కార్యక్రమాలు చేస్తున్నామని ప్రతి విషయం ఒక క్రమపద్ధతిలో చేస్తున్నామని వివరించారు. భగవంతుడి దయతో వర్షపాతం తక్కువైనప్పటికీ నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. 

మా ప్రభుత్వ పాలన చూసి కన్నుకుట్టి.. రాక్షస ఆలోచనతోనే చంద్రబాబు ఆయన అనుచరులు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. జిమ్మిక్కులు ఆపండి. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు భయపడతాయనుకోవద్దు. 40సంవత్సరాల అనుభవం ఇదా.. పెన్షన్, ఇళ్ల పట్టాలు, రైతు భరోసా వంటి కార్యక్రమాలను చంద్రబాబు పూర్తి చేయగలిగారా అని ప్రశ్నించారు.