Botsa Satyanarayana: కొందరు మాయమాటలు చెబుతున్నారు: బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో కొందరు మాయమాటలు చెబుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి విశాఖ గర్జన ఓ కను విప్పు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడితే చూడలేరా? అని నిలదీశారు. జనసేన అసలు రాజకీయ పార్టీయేనా? అని ప్రశ్నించారు. జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదని చెప్పారు. విశాఖకు రాజధాని వద్దని పవన్ కల్యాణ్ ఎందుకు అంటున్నారని నిలదీశారు.

Botsa Satyanarayana: కొందరు మాయమాటలు చెబుతున్నారు: బొత్స సత్యనారాయణ

Minister Botsa Satyanarayana

Updated On : October 16, 2022 / 1:37 PM IST

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో కొందరు మాయమాటలు చెబుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారికి విశాఖ గర్జన ఓ కను విప్పు అని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడితే చూడలేరా? అని నిలదీశారు. జనసేన అసలు రాజకీయ పార్టీయేనా? అని ప్రశ్నించారు. జనసేనకు రాజకీయ పార్టీ లక్షణమే లేదని చెప్పారు. విశాఖకు రాజధాని వద్దని పవన్ కల్యాణ్ ఎందుకు అంటున్నారని నిలదీశారు.

జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ అని బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖకు పరిపాలనా రాజధాని వస్తుంటే టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే దీనిపై టీడీపీ, జనసేన పార్టీకి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ఆ పార్టీల ఆటలను కొనసాగివ్వబోమని అన్నారు.  విశాఖలో ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ పెడితే ప్రజల అభిప్రాయాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు సాగవని, విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..