వైఎస్ జగన్ కు బీటెక్ రవి ఆఫర్.. పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వస్తే..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి (Btech Ravi) సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ

Btech Ravi
Btech Ravi : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బీటెక్ రవి (Btech Ravi) సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుకాని జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే.. నా భార్య కూడా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తుందని అన్నారు.
Also Read : Kakani Govardhan Reddy : జైలు నుంచి విడుదలైన కాకాని గోవర్ధన్ రెడ్డి.. టీడీపీ నేతలపై కీలక కామెంట్స్..
పులివెందుల ప్రజా సమస్యలకోసమైనా అసెంబ్లీకి రాని జగన్‌కు ఎమ్మెల్యే పదవి కూడా అనవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జెడ్పీటీసీ ఉపఎన్నిక పై రాజీనామా, కేంద్ర బలగాలు కోరుతున్న జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే, నా భార్య కూడా జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తుంది. రెండు ఉపఎన్నికలు కేంద్ర బలగాల సాయంతో నిర్వహించి.. ఎవరి దమ్మెంతో తేల్చుకుందాం అంటూ జగన్ మోహన్ రెడ్డికి బీటెక్ రవి సవాల్ చేశారు.
నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు వల్ల కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న వివేకా హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. జడ్జి వ్యాఖ్యలను బట్టి చూస్తే మరణ శిక్షకు కూడా వారు అర్హులు అన్నట్లు ఉన్నాయి. సునీత పోరాటానికి న్యాయం జరిగే సమయం అతి దగ్గరలోనే ఉందని అర్ధమవుతుందని బీటెక్ రవి అన్నారు.
వివేకా హత్య కేసు అంశంలో వైఎస్ అవినాష్ రెడ్డితో అరెస్ట్ ఆగదు. అంతకు మించి అరెస్ట్‌లు ఉంటాయి. ఎన్నిక జరిగితే జగన్ పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియ చేయాలని మొన్నటి జడ్పీటీసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఇక నుంచి పులివెందులలో మేము వ్యూహాత్మకంగా ముందుకు పోతామని బీటెక్ రవి చెప్పారు.
ఇదిలాఉంటే.. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా హేమంత్ రెడ్డి పోటీ చేశారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తొమ్మిది మంది స్వతంత్ర్య అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా.. ఈనెల 14న వెలువడిన జడ్పీటీసీ ఉపఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో డిపాజిట్ కోల్పోవాల్సి వచ్చింది.