Students Trapped In Forest : శేషాచలం అడవుల్లో దారితప్పిన బీటెక్ విద్యార్థులు.. ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?

సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు.. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు.

Students Trapped In Forest : శేషాచలం అడవుల్లో దారితప్పిన బీటెక్ విద్యార్థులు.. ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?

Updated On : January 4, 2025 / 2:13 AM IST

Students Trapped In Forest : అన్నమయ్య జిల్లాలో శేషాచలం అడవుల్లోకి వెళ్లిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు దారితప్పారు. గుంజనేరు వాటర్ ఫాల్స్ చూసేందుకు విద్యార్థులు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దారి తప్పి అడవిలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. తప్పిపోయిన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి జాడ కనుగొనేందుకు అడవిని జల్లెడ పడుతున్నారు.

రైల్వేకోడూరు సమీపంలో ఉన్న శేషాచలం అడవుల్లో ఆరుగురు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం వెళ్లారు. గుంజనేరు జలపాతాన్ని చూసేందుకు వారంతా అక్కడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు దారితప్పారు. అడవిలో చిక్కుకున్నారు. విద్యార్థులంతా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. వీరంతా దారితప్పి అడవిలోనే చిక్కుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, పోలీసులు.. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

గుంజనేరు వాటర్ ఫాల్స్ కు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో సమాచారం తీసుకోవడంతో పాటు గుంజనేరు వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాలతో పాటు అడవిలోకి వెళ్లే దారి, బయటకు వచ్చే దారి తెలిసిన కొంతమంది వ్యక్తులను వెంటపెట్టుకుని పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అడవిలోకి వెళ్లారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకుని వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు అనారోగ్యం బారిన పడినట్లుగా తెలుస్తోంది. దాంతో వీలైనంత త్వరగా వారిని గుర్తించి, కాపాడి, బయటకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

Also Read : చంద్రబాబు, జగన్, కేసీఆర్ బాటలో పవన్ కల్యాణ్.. ఏం చేస్తున్నారో తెలుసా..?