Bandaru Satyanarayana : టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోమవారం రాత్రి విశాఖలో బండారు సత్యనారాయణను  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Bandaru Satyanarayana : టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

Bandaru Satyanarayana (Photo : Google)

Updated On : October 3, 2023 / 7:55 AM IST

Bandaru Satyanarayana – Cases Registered : టీడీపీ నేత బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుంటూరులో బండారుపై రెండు పోలీస్ స్టేషన్ లలో వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండారు సత్యనారాయణపై 354/2023U/S 153(A), 354(A), 504, 505, 506, 509, 499 IPC, సెక్షన్ 67 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద నగరంపాలెం పోలీసులు కేసులు నమోదు చేశారు.

మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో బండారుపై మరొక కేసు నమోదు చేశారు. బండారు సత్యనారాయణను పోలీసులు గుంటూరుకు తీసుకువచ్చారు.

Bandaru Satyanarayana : టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అరెస్ట్

సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిన్న(సోమవారం) రాత్రి విశాఖలో బండారు సత్యనారాయణను  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయన ఉన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాత ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.