JanaSena: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారు చేస్తూ ఉత్తర్వులు

గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే.

JanaSena: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారు చేస్తూ ఉత్తర్వులు

Janasena Gets Glass Tumbler Symbol

Updated On : January 24, 2024 / 10:26 PM IST

జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలను పవన్‌కు జనసేన పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ అందజేశారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరారు.

ఏపీలో మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా టీడీపీ-జనసేనతో కలిస్తే కాషాయ పార్టీ ఏయే స్థానాల్లో పోటీ చేస్తుందన్న ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan: జనసేనలో చేరిన పృథ్వీ, జానీ మాస్టర్‌కు పవన్ కల్యాణ్ కీలక సూచనలు