Pawan Kalyan: జనసేనలో చేరిన పృథ్వీ, జానీ మాస్టర్‌కు పవన్ కల్యాణ్ కీలక సూచనలు
ఏపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. జనసేన కార్యక్రమాల్లో ఉత్సాహం..

Pawan Kalyan
సినీ నటుడు పృథ్వీరాజ్, కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ ఇవాళ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిద్దరికీ పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు.
ఏపీలో జనసేన గెలుపు కోసం కృషి చేయాలని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన విధానాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు. జనసేన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని సూచించారు.
మరోవైపు, ఎన్నికల వేళ శ్యాంబాబు పాత్ర వేషధారణతో పర్యటిస్తానని పృథ్వీరాజ్ ఇప్పటికే తెలిపారు. సత్తెనపల్లి నుంచి శ్యాంబాబు వేషధారణతో ప్రచారం ప్రారంభిస్తాన్నారు.
కాగా, ఎన్నికల వేళ ఇప్పటికే పలువురు కీలక నేతలు జనసేన పార్టీలో చేరారు. వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే జనసేన-టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?