Polavaram : మరో రెండేళ్లు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? జాప్యానికి కారణాలు ఏంటో కూడా కేంద్రం చెప్పింది.

Polavaram
Polavaram : ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా కేంద్రం చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవడానికి మరో రెండేళ్లు పడుతుందని కేంద్రం చెప్పింది. అంటే..2024 జులై నాటికే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి సాధ్యమని పార్లమెంటుకు తెలిపింది కేంద్రం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలిపిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కావడానికి గల కారణాలను కూడా వివరించింది.
రాష్ట్రమే కడుతుంది : పోలవరంపై మంత్రి కీలక వ్యాఖ్యలు
టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయశాఖ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీకి ఖర్చు పెట్టే సామర్ధ్యం తక్కువగా ఉంది. నిర్మాణ, నిర్వహణ అంతా లోప భూయిష్టంగా ఉంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతోంది. ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి ప్రధాన కారణం అని జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పింది. కరోనా కూడా పోలవరం జాప్యానికి మరో కారణం అని కేంద్రం వెల్లడించింది. 2022 ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. ఈ కారణాల వల్ల జాప్యం అవుతోందని కేంద్రం వివరించింది.
పోలవరానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబే, వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం సబబే