Health Funds : ఏపీకి కేంద్రం నుంచి రూ.488 కోట్లు

కేంద్ర ఆరోగ్య విభాగం నుంచి 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు నిధులు వినియోగించనున్నారు.

Health Funds : ఏపీకి కేంద్రం నుంచి రూ.488 కోట్లు

Health Founds

Updated On : November 14, 2021 / 9:09 AM IST

Health Funds : కేంద్ర ఆరోగ్య విభాగం నుంచి 19 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు నిధులు వినియోగించనున్నారు. మొత్తం రూ.8,453.92 కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్రం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 488 కోట్లు విడుదల చేశారు.

చదవండి : Health Minister Harish Rao : రాష్ట్రంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి-హరీష రావు

పదిహేనవ ఆర్థిక సంఘం (FC-XV) తన నివేదికలో 2021-22 నుండి 2025-26 వరకు స్థానిక ప్రభుత్వాలకు మొత్తం రూ. 4,27,911 కోట్లు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. 19 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (రూ. 488.15 కోట్లు), అరుణాచల్ ప్రదేశ్ (రూ. 46.94కోట్లు), అస్సాం (రూ. 272.25 కోట్లు), బీహార్ (రూ. 1116.30 కోట్లు), ఛత్తీస్‌గఢ్ (రూ. 338.79 కోట్లు), హిమాచల్ ప్రదేశ్ (రూ. 444.39కోట్లు), కర్ణాటక (రూ. 551.53)

చదవండి : Health Problems : కరోనా నుండి కోలుకున్న వారిలో కొత్త ఆరోగ్యసమస్యలు

మధ్యప్రదేశ్ (రూ. 922.79), మహారాష్ట్ర (రూ. 778 కోట్లు), మణిపూర్ (రూ. 42.87), మిజోరాం (రూ. 31.19 కోట్లు), ఒడిశా (రూ. 693 కోట్లు), పంజాబ్ (రూ. 69 కోట్లు), రాజస్థాన్ (రూ. 656.17 కోట్లు), సిక్కిం (రూ. 20.97 కోట్లు), తమిళనాడు (రూ. 805.92 కోట్లు), ఉత్తరాఖండ్ (రూ. 150.09 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ. 828.06 కోట్లు). తెలంగాణ సహా 9 రాష్ట్రాల నుంచి ఇంకా ప్రతిపాదనలు అందలేదు. అయితే ప్రతిపాదనలు అందిన తర్వాత ఆ రాష్ట్రాలకు కూడా నిధుల విడుదల చేయనున్నారు.