Health Problems : కరోనా నుండి కోలుకున్న వారిలో కొత్త ఆరోగ్యసమస్యలు
లాంగ్ కోవిడ్ లక్షణాల వల్ల రక్తనాళాలతో ముడిపడిన వివిధ సమస్యలు తలెత్తవచ్చు. పేగులకు రక్తప్రసారాన్ని తీసుకెళ్లే సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా కంటిచూపు పోవడం, గుండెపో

Human Body
Health Problems : కరోనా నుండి కోలుకున్నామన్న సంతోషంలో చాలా మంది ఉన్నారు. మరికొందరు కరోనా తమ దరికి చేరలేదన్న ఆనందపడుతున్నారు. అయితే అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా నుండి కోలుకున్నవారు, అసలు వైరస్‌బారిన పడని వారు ప్రస్తుతం కొత్త అనారోగ్య సమస్యలపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కడుపు నొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు, నల్లరంగులో మలం, మూత్రంలో రక్తపు చారల వంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
నల్ల రంగులో మలవిసర్జన అవుతుంటే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలా జరుగుతుందటంటే చిన్న, పెద్ద పేగుల్లో గ్యాంగ్రీన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనావేస్తున్నారు వైద్యులు. పోస్ట్ కోవిడ్ లేదా లాంగ్ కోవిడ్ బాధితుల్లో రక్తం గడ్డకట్టే తత్వం పెరుగుతోందని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో హైపర్ కోఅగ్యుల బుల్, మరియు ప్రోత్రోంబొటిక్‌గా పిలుస్తున్నారు. లేటెస్ట్ గా పదిరోజుల వ్యవధిలోనే నిమ్స్ ఆసుపత్రిలో ఏడు కేసులు, ఏఐజీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి.
దీంతో వైద్యులు అప్రమత్తం అయ్యారు. గతంలో వీరేమైనా కోవిడ్ బారిన పడ్డారా అని ఆరా తీశారు. అయితే చాలా మంది తమకు కరోనా సోకలేదని స్పష్టంచేశారు. టెస్టుల్లో వీరికి కోవిడ్ యాంటీబాడీస్ గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. కరోనా వచ్చిపోయి ఉంటుందని, అది సోకినా లక్షణాలు కనిపించనివారిగా వీరి పరిగణిస్తున్నారు. ఈ పేషెంట్లలో కోవిడ్ పాజిటివ్ యాంటీబాడీస్ ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం వెలుగుచూస్తున్న వ్యాధుల్లో కొన్ని కరోనా సంబంధితమైనదిగా వైద్యులు నిర్ధారిస్తున్నారు.
లాంగ్ కోవిడ్ లక్షణాల వల్ల రక్తనాళాలతో ముడిపడిన వివిధ సమస్యలు తలెత్తవచ్చు. పేగులకు రక్తప్రసారాన్ని తీసుకెళ్లే సిరలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా కంటిచూపు పోవడం, గుండెపోటు, గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, శరీరంలో ఎక్కడైనా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం సంభవించే అవకాశాలున్నాయి. అలాగే చిన్న, పెద్ద పేగులకు రక్తం సరఫరా చేసే నాళాల్లో రక్తం గడ్డకట్టాక అవి కుళ్లిపోయి గ్యాంగ్రీన్ లు ఏర్పడుతున్నాయి. కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన వారు, దీర్ఘకాలిక జబ్బులున్నవారు, బీపీ, ఊబకాయం, గుండె సంబంధిత జబ్బులు, ఎక్కువకాలం ఎటూ కదలకుండా ఒకేచోట గడిపే వారికి ఈ థ్రోంబొటిక్ సమస్యలు తీవ్రం కావొచ్చు. ఈ సమస్య అత్యధికంగా పురుషుల్లోనే వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.
కరోనా వచ్చి తగ్గిన వారికి డాక్టర్లు సుదీర్ఘకాలంపాటు రక్తాన్ని పలుచన చేసే యాంటీ కోవిలియెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నాం. గతంలో ఈ మందులను స్వల్పకాలం ఇస్తే సరిపోతుందనే అంచనా ఉండగా ఇప్పుడు దానిని మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నాం. కరోనా బారిన పడ్డాక కొందరిలో రక్తం గడ్డ కడు తోంది. పేగుల్లో బ్లాక్స్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వ్యాక్సిన్ దుష్పరిణామాల వల్ల ఇలా జరిగి ఉంటుందా అనే కోణంలో వైద్యులు పరిశీలన జరపగా అది ఏమాత్రం కాదని తేలింది.
కోవిడ్ ఫస్ట్, సెకండ్‌వేవ్‌లలో ఇలాం టి కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యా యి. హైపర్ కోఅగ్యులబుల్‌లక్షణాలు, ప్రభా వాలు ఏర్పడినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, అంతర్గత అవయవాలు, కాళ్లకు రక్త సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇటీవలి కాలంలో ఈ లక్షణా లకు సంబంధించిన కేసులు నమోదు అవుతుండడంతో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిమ్స్ ప్రొఫెసర్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్. బీరప్ప పేర్కొ న్నారు. ఈ లక్షణాలను వీలైనంత తొందరగా గమనించి చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు.