Kuppam : ప్రతిపక్ష నేత ఇలాఖాలో స్కూళ్లు..మురిసిపోతున్న చిన్నారులు
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి.

Kuppam Nadu Nedu
Nadu Nedu Govt Schools : నాడు – నేడు పథకంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంతో పోల్చుకుంటే ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ముస్తాబయ్యాయి. సుందరంగా ముస్తాబైన తమ స్కూళ్లను చూసి చిన్నారులు మురిసిపోతున్నారు. అయితే..ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి. సుమారు 30 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ తీసుకురావడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
Read More : Vijayawada : రాహుల్‌ను చంపేశారు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం ?
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో అధికార వైసీపీ కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కుప్పంలో పాగా వేసేలా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎలక్షన్స్‌లోనూ కుప్పంలో వైసిపి రికార్డ్ క్రియేట్ చేసింది. అదే ఊపుతో అధికార పార్టీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతుంది. ఇక నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా కుప్పం స్కూళ్లకు మహర్దశ లభించింది. నియోజకవర్గ పరిధిలోని స్కూళ్ల రూపురేఖలు చాలా మారిపోయాయి. అనేక ప్రభుత్వ బడులు ఇప్పుడు సుందరంగా ముస్తాబయ్యాయి. ఇందుకోసం విద్యాశాఖ ఒక్క కుప్పంపైనే కోట్ల రూపాయలు వెచ్చించింది.
Read More : Karvy : బ్యాంక్ రుణాల ఎగవేత.. కార్వీ ఎండీ పార్థసారధి రెడ్డికి 14 రోజుల రిమాండ్
కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం మండలాల పరిధిలోని 117 ప్రభుత్వ పాఠశాలల కోసం సుమారు 30 కోట్ల 26 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కుప్పం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలను నాడు – నేడు పథకానికి సంబంధించి డెమో స్కూల్‌గా ఎంపిక చేసింది. ఈ ఒక్క స్కూల్ కే 90 లక్షలను మంజూరు చేయగా, తాజాగా మరో ఎనిమిది లక్షలకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు. అలాగే శాంతిపురంలోని మోడల్ స్కూల్ కు సంబంధించి నాడు – నేడు పథకంలో 89 లక్షల రూపాయలతో పనులు చేయగా, అదనంగా 16 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు పంపారు.
Read More :Panjshir : అప్ఘాన్ లకు అండగా ” పంజ్ షిర్”..ఆయన పేరు వింటేనే తాలిబన్లకు వణుకు
నాడు – నేడు పథకంలో భాగంగా కుప్పం మండలంలోని 43 పాఠశాలలకు 11 కోట్ల 29 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక గుడిపల్లి మండల పరిధిలోని 23 పాఠశాలలకు సంబంధించి ఐదు కోట్ల 50 లక్షలు, శాంతిపురం మండలంలోని 28 పాఠశాలలకు 6 కోట్ల 50 లక్షలు, రామకుప్పం మండలంలోని 23 పాఠశాలలకు 6 కోట్ల 35 లక్షలు మంజూరు చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కంటే తాము అధికారంలోకి వచ్చాకే కుప్పంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతోందని నిరూపించేందుకే వైసీపీ నేతలు ఈ స్థాయిలో అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.
Read More :Chiranjeevi : బాస్ స్పీడ్..! చిరుని ఇంప్రెస్ చేసిన మరో డైరెక్టర్..
ఏది ఏమైనా ఒక్క నియోజకవర్గంలోనే ప్రభుత్వ పాఠశాలలపై ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనూ సంచలనంగా మారింది. పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు కావడంతో విద్యార్థులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న కష్టాలను తొలగించిన అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నారు.