Chandrababu : ఆసుపత్రిలోనే చంద్రబాబు.. కొనసాగుతున్న వైద్య పరీక్షలు
రేపు కూడా కొన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు. రేపు మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లే చాన్స్ ఉంది. Chandrababu In Hospital

Chandrababu In Hospital
Chandrababu In Hospital : చంద్రబాబుకి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటల 20 నిమిషాలకు ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రి ఆయన ఆసుపత్రిలోనే ఉండనున్నారు. రేపు మరికొన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు వైద్యులు. వైద్య పరీక్షల కోసం ఈ ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు చికిత్స కోసం అక్కడ అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేస్తోంది.
52 రోజుల పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానంగా చర్మ సంబంధ ఆరోగ్య సమస్యలతో పాటు కంటి సమస్య, గ్యాస్ట్రిక్ ట్రబుల్, వెన్నుముక కింది భాగంతో కొంత నొప్పితో బాధపడుతున్నారు చంద్రబాబు. ఆయనకు ఎటువంటి వైద్య పరీక్షలు చేయాలి అనే దానిపై ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. రేపు కూడా కొన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు.
Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ
రేపు మధ్యాహ్నం వరకు చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చంద్రబాబు వెళ్లే చాన్స్ ఉంది. అక్కడ కంటి పరీక్షలు చేయించుకుంటారు. రేపు సాయంత్రం చంద్రబాబు తన నివాసానికి వెళ్లనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్టోబర్ 31న విడుదల అయ్యారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. పలు షరతులు విధించింది. నాలుగు వారాల అనంతరం నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని చంద్రబాబుని ఆదేశించింది కోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also Read : ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది, జగన్‌ను దూరం చేయాలని చూస్తున్నారు- మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు