దేశంలో ఎక్కడా లేని విధంగా 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. మన తరువాత తెలంగాణలో..: చంద్రబాబు

"ఆటోడ్రైవర్లకు వేధింపులు ఉండవు. జరిమానాల జీవోను అవసరం అయితే రద్దు చేస్తాం. మీకోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం" అని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. మన తరువాత తెలంగాణలో..: చంద్రబాబు

Updated On : October 4, 2025 / 3:16 PM IST

Chandrababu Naidu: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.33 వేల కోట్లు పించన్లకు ఖర్చు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ తరువాత తెలంగాణలో రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

“ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. “దుర్గమ్మతల్లి దగ్గరకు శ్రీకాకుళం, మంత్రాలయం నుంచి వచ్చి దర్శనం చేసుకున్నారు అంటే స్త్రీ శక్తి పవర్. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ. స్తీ శక్తి బంపర్ హిట్ అయ్యింది. మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం.

ఆటోడ్రైవర్లు, వివిధ రకాలు వెహికిల్స్, మెటార్ క్యాబ్, మ్యాక్సి క్యాబ్ లకు కూడా డబ్బులు ఇస్తున్నాం. 2 లక్షల 90 వేల 669 మందికి డబ్బులు పడ్డాయి. ఎవరికైనా పడకపోతే వెంటనే రిపోర్టు చేయండి. ఓ ఆటోడ్రైవర్ ప్యామిలీతో కలిసి ప్రయాణం చేశాను. ఆ ఆటోడ్రైవర్ నాన్న కూడా డ్రైవర్. అందుకే ఆయన తన పిల్లలను చదివించాలని నిర్ణయం తీసుకున్నారు.

అప్సర్ ఖాన్, ఆయన భార్య కష్టపడి ఇద్దరి పిల్లలను బాగా చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చిన్నకొడుకు 10వ తరగతిలో స్టేట్ 4వ ర్యాంకు సాధించాడు. ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలను చదివిస్తే ప్రపంచాన్ని శాసించగలుగుతారు. 23 వేల కిలోమీటర్లు రోడ్ల మరమ్మతు పనులు చేశాం. భవిష్యత్తులో ఎక్కడా పాత్ హోల్స్ ఉండవు.

ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం. అన్నా క్యాంటిన్ లో 5 రూపాయలకే టిఫిన్ ఇస్తున్నాం. దీంతో ఆడబిడ్డలకు క్యారేజీ ఇబ్బంది లేదు. ఎక్కడ ఆకలి వేస్తే అక్కడ భోజనం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది. 175 నియోజకవర్గాల్లో 175 అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేస్తున్నాం.

విజయవాడలో 95 శాతం సీఎన్జీ వెహికిల్స్‌ ఉన్నాయి. వారిని అభినందిస్తున్నాం. రాబోయే రోజుల్లో సీఎన్జీ, ఎలక్ట్రికల్ వెహికిల్స్‌కు మారుతాం. మీ ఆరోగ్యం కోసం యూనివర్సిల్ హెల్త్ కార్డులు ఇస్తున్నాం. ఆటోడ్రైవర్లకు వేధిపులు ఉండవు. జరిమానాల జీవోను అవసరం అయితే రద్దు చేస్తాం. మీకోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.