పవన్ కళ్యాణ్ ఎవరికీ అన్యాయం చేయలేదు – బాబు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సీఎం జగన్ శాసనసభలో మాట్లాడడం నీచమన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సీఎం స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాలో సభలో ప్రస్తావించడం దుర్మార్గమన్నారు. ప్రజా జీవితంలో పవన్ ఎవరికీ అన్యాయం చేయలేదని, జగన్ ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. సభలో జరిగిన పరిణామాలను వివరించేందుకు బాబు సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
రాజకీయ నాయకులకు ఇద్దరు..ముగ్గురు భార్యలున్నారని..సీఎం జగన్ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. చరిత్రలో ఇలాంటి చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసిందన్నారు. ఏది మాట్లాడినా..తమపై..తన కుటుంబంపై, పవన్‌పై ఆయన ఫ్యామిలీపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్వం, అహంభావం పెరిగిపోయిందని, ప్రజా కష్టాల కోసం తాము పనిచేయడం జరుగుతుందన్నారు. సీఎం జగన్ బాబాయ్ హత్య కూడా తామే చేశామని ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని, వారికి అండగా ఉంటామన్నారు.
* ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ప్రారంభమయ్యాయి.
* వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇది రెండోసారి.
* ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది.
* జగన్ ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను సభలో గట్టిగా ఎండగట్టాలని టీడీపి నిర్ణయం.
* 21 అంశాలు సభలో ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది.
* రాజధాని అమరావతి, ఇసుక, ఇంగ్లీష్ మీడియం, రైతులకు గిట్టుబాటు ధర, ఉల్లి, అప్పులు, ప్రభుత్వం జారీ చేసిన జీవోలు.. నిత్యావసర ధరలు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించుకుంది.
* మొదటి రోజు తెలంగాణలో దిశ హత్యాచారంపై చర్చ జరిగింది.
* ఏపీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలు దాడులకు సంబంధించి కీలక చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయం.
* సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి.
* ఉల్లిగడ్డ కొరతపై చర్చ జరగాలని టీడీపీ ఆందోళన.
* మహిళ భద్రత బిల్లుపై సభలో చర్చ.
Read More : రాష్ట్ర రైతాంగం కోసం : పవన్ కళ్యాణ్ దీక్షకు డేట్ ఫిక్స్