ఏపీ మంత్రి రోజాపై చంద్రబాబు నాయుడు విమర్శలు
చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నగరిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని..

Chandrababu Naidu
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఆమెను జబర్దస్ ఎమ్మెల్యే అని పేర్కొంటూ నగరికి ఆమె ఏమీ చేయలేదని అన్నారు. ఆమె మోసాలకు పాల్పడుతోందని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నగరిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీ కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని తెలిపారు. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి వెళుతున్నామని అన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎవరికీ భయపడవద్దని, గేమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పారు. తన వద్ద డబ్బులు, ప్రైవేట్ సైన్యం లేవని అన్నారు. ఏడుకొండల వాడు అలిపిరి వద్ద తనను గతంలో కాపాడాడని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు మైక్ కట్ చేశారని, తాను వైసీపీ తోకలు కట్ చేస్తానని అన్నారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేనే మొదటి బాధితుడిని: రఘునందన్ రావు