Chandrababu Naidu: ఈ సభను చూసైనా తాడేపల్లి నేతల్లో మార్పు రావాల్సిందే.. ప్రజల్లో తిరుగుబాటు: చంద్రబాబు

రాయలసీమ ప్రాజెక్టులకు తమ పార్టీ హయాంలో రూ.12 వేల కోట్లు ఇచ్చామని, వైసీపీ హయాంలో రూ.2,000 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు.

Chandrababu Naidu: ఈ సభను చూసైనా తాడేపల్లి నేతల్లో మార్పు రావాల్సిందే.. ప్రజల్లో తిరుగుబాటు: చంద్రబాబు

Chandrababu Naidu

Updated On : August 2, 2023 / 8:59 PM IST

Chandrababu Naidu – Pulivendula: ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘పెన్నా నుంచి వంశధార’ (Penna to Vamsadhara projects) పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు నాయుడు ఇవాళ కొండాపురం ప్రాజెక్టును సందర్శించారు.

అనంతరం పులివెందుల, పూల అంగళ్ల సర్కిల్‌ వద్ద ప్రసంగించారు. పులివెందులలో ఈ సభను చూసైనా తాడేపల్లి నేతల్లో మార్పు రావాలని చెప్పారు. సీఎం జగన్‌, వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆర్భాటాలు పోతున్నారని, ప్రజలకు చేసింది ఏమీదలేని అన్నారు.

రాయలసీమ ప్రాజెక్టులకు తమ పార్టీ హయంలో రూ.12 వేల కోట్లు ఇచ్చామని, వైసీపీ హయాంలో రూ.2,000 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. సీమ అభివృద్ధి టీడీపీ వల్లే జరుగుతుందని చెప్పారు. తాను ముచ్చుమర్రిలో లిఫ్టులు పూర్తి చేశానని తెలిపారు. గండి కోటకు నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీదని అన్నారు.

వైసీపీపై పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనపడుతోందని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని అన్నారు. పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకువచ్చి రాయలసీమకు ఇచ్చామని చెప్పారు. తాను దూరదృష్టితో నీళ్లు తేవడం వల్లే రైతులు బాగుపడ్డారని తెలిపారు.

YS Sharmila: వరద బాధితులకు సాయం అందక చస్తుంటే సంబురాలు చేసుకోమంటారా చిన్న దొర?: షర్మిల