Chandrababu Case : చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. పీటీ వారెంట్‌పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు కోర్టులో హాజరుపరచాలని సూచించారు. Chandrababu

chandrababu fibernet case
Chandrababu Fibernet Case : ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ పై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు కోర్టులో హాజరుపరచాలని సూచించారు. చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు.
ఫైబర్ నెట్ కేసులో సీఐడీ వేసిన పీటీ వారంట్ పై వాదనలు జరిగాయి. ఇరుపక్షాల లాయర్లు వాదనలు వినిపించారు. అయితే, సీఐడీ తరపు న్యాయవాది వివేకానం చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. సోమవారం చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని టీడీపీ లాయర్లకు జడ్జి సూచించారు.
చంద్రబాబు, సీఐడీ తరపు లాయర్ల మధ్య వాగ్వాదం..
చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ రికార్డుపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో సీఐడీ తరపు న్యాయవాదులకు, చంద్రబాబు తరపు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే విచారణ నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. కోర్టు హాల్ లో అరుచుకున్న న్యాయవాదుల వివరాలు రికార్డు చేయాలని ఆదేశించారు. వివాదాలతో ఉంటే ఈ కేసు విచారణ నేను చేయలేనని బెంచ్ దిగి వెళ్లిపోయారు న్యాయమూర్తి. అనంతరం కేసు విచారణను వాయిదా వేశారు న్యాయమూర్తి.