Chandrababu Naidu: అందరి చరిత్ర నా వద్ద ఉంది.. ఎవరూ తప్పించుకోలేరు: చంద్రబాబు వార్నింగ్

‘అందరి చరిత్ర నా వద్ద ఉంది.. ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద అధికారయినా తప్పించుకోలేరని చెప్పారు. తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, నేరస్థుల కట్టడికి ప్రాణం ఉన్నంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వైఎస్ వివేక హత్య తర్వాత ఇద్దరు చనిపోయారని, అంతేగాక, అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నారని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu: అందరి చరిత్ర నా వద్ద ఉంది.. ఎవరూ తప్పించుకోలేరు: చంద్రబాబు వార్నింగ్

Chandrababu Naidu on chennupati

Updated On : October 14, 2022 / 1:58 PM IST

Chandrababu Naidu: ‘అందరి చరిత్ర నా వద్ద ఉంది.. ఎవరూ తప్పించుకోలేరు’ అంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంత పెద్ద అధికారయినా తప్పించుకోలేరని చెప్పారు. తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, నేరస్థుల కట్టడికి ప్రాణం ఉన్నంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

వైఎస్ వివేక హత్య తర్వాత ఇద్దరు చనిపోయారని, అంతేగాక, అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా ప్రాణభయంతో ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారని, రాష్ట్రంలో ఓ ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటీ? అని ఆయన నిలదీశారు.

పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఆయన అన్నారు. తాను ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చూడలేదని చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక మార్పులకు టీడీపీ కారణమైందని ఆయన అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..